బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థులకు 206 కోట్ల ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ నిధులను విడుదల

బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థులు ఈ రోజు స్థానిక సర్పంచ్ శ్రీ ఎడ్ల వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ కోసం రూ.206 కోట్ల నిధులు విడుదల కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే గారితో కలిసి గ్రామస్థులు ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్...