కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ హత్య కేసును ఛేదించిన నల్లగొండ పోలీసులు ఇద్దరు మైనర్ విద్యార్థుల ప్రమేయాన్ని గుర్తించిన పోలీసులు – నగదు, ఐఫోన్, ఆయుధం స్వాధీనం
నల్లగొండ: కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మందలింపుతో కక్ష పెంచుకున్నారని పోలీసుల వెల్లడి పోలీసుల వివరాల ప్రకారం, ఇద్దరు విద్యార్థులు పాఠశాల హాస్టల్‌లో ఉంటూ...