జాతీయ సద్భావనా దినోత్సవం: భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలం సద్భావనను ఒక రోజు మాత్రమే కాదు… జీవిత విధానంగా ఆచరించాలి – మధుబాబు చికిలే, నేషనల్ డైరెక్టర్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్

ఆగస్టు 20, 2026: భారతదేశం అనేక మతాలు, భాషలు, కులాలు, ప్రాంతాలు, సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన భిన్నత్వ దేశం. ఈ భిన్నత్వాన్ని ఏకత్వంగా నిలబెట్టే ప్రధాన విలువల్లో సద్భావన, పరస్పర గౌరవం, సహనం, సోదరభావం, శాంతి, సామరస్యం ముఖ్యమైనవి అని వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ మధుబాబు చికిలే అన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 20న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతీయ సద్భావనా దినోత్సవం నిర్వహిస్తారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, శాంతి, ప్రజల మధ్య...