వృద్ధులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
గురువారం చౌటుప్పల్ మండలం పెద్దకొండూర్ గ్రామ పరిధిలో ప్రభుత్వ అనుబంధంతో, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయి యాదాద్రి సేవాశ్రమాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆశ్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో ప్రస్తుతం ఎంతమంది వృద్ధులు ఉంటున్నారని , వారికి కల్పిస్తున్న వసతులు, ప్రతిరోజూ అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆరా తీశారు. వృద్ధుల ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ప్రతిరోజూ వ్యాయామం చేయించడం,జరుగుతుందా అని,క్యారమ్స్,...