ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు

నవపక్షం ,చౌటుప్పల్, ఆగస్టు 20: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ సమక్షంలో ఏఈఓ వీణ రైతులతో సమావేశమై పంటల సాగుపై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి సాగుతో ఆశించిన దిగుబడులు రాకపోయే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని ఏఈఓ వీణ సూచించారు. కంది, పెసర, మినుము, బొబ్బర్లు, శనగ, ఉలవలు, కూరగాయలు వంటి...