చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలకు అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలి -BJYM మండల ప్రెసిడెంట్ నాంపల్లి సతీష్

నాంపల్లి మండలంలోని చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత ఉందని, వెంటనే అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసిన BJYM మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్. ఈ సందర్బంగా నాంపల్లి సతీష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన మేరకు ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచడం విద్యాశాఖ బాధ్యత అని పేర్కొన్నారు.నాంపల్లి మండలంలో గానీ,నల్లగొండ...