సహజ వ్యవసాయ రైతు క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్ కుమార్
నవపక్షం ,నాంపల్లి ప్రతినిధి : నాంపల్లి మండలం ఒంటెద్దుగూడెం గ్రామానికి చెందిన సహజ వ్యవసాయ రైతు మద్దూరి రాధాకృష్ణ వ్యవసాయ క్షేత్రాన్ని నల్లగొండ జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్ కుమార్ నేడు క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA), నాంపల్లి మండల వ్యవసాయ అధికారి (MAO), నాంపల్లి మండల వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు మద్దూరి రాధాకృష్ణ అనుసరిస్తున్న సహజ వ్యవసాయ పద్ధతులను జిల్లా వ్యవసాయ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల...