ఏఎస్ పేట దర్గా ఉర్సుపై హైకోర్టు ఆదేశాలపై సమాచారం

ఏఎస్ పేట: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గా వద్ద జరుగుతున్న 253వ ఉర్సు ఉత్సవాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వంశపారంపర్య సజ్జాదా నషీన్ SGN హఫీజ్ పాషా మతపరమైన విధులు, గంధం కుండ (సందల్ పాట్) ఎత్తే కార్యక్రమంతో పాటు ఇతర ఆచారాలను నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని వక్ఫ్ బోర్డును కోర్టు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వివరణ కోరినట్లు కూడా సమాచారం....