22ఏ నిషేధిత భూముల సమస్యను ఈ ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుంది-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్: హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేరిన భూముల సమస్యపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లాలోని 22ఏ నిషేధిత భూముల సమస్యపై సుమారు నాలుగు నెలల క్రితం తాను అసెంబ్లీలో ప్రస్తావించానని బీర్ల ఐలయ్య గారు తెలిపారు.ఈ సమస్యను పరిష్కరించాలని సంబంధిత శాఖ మంత్రి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, రాష్ట్ర మంత్రి...