చౌటుప్పల్‌లో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

నవపక్షం ,చౌటుప్పల్, ఆగస్టు 21: శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా భక్తులచే సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు శ్రీ పెద్ది సుధాకర్ శర్మ వేద మంత్రోచ్ఛరణలతో అమ్మవారి వ్రత కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చౌటుప్పల్ పురపాలక పరిధికి చెందిన వందలాది మహిళా భక్తులు ఈ సామూహిక వ్రతంలో పాల్గొన్నారు. తమ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలని, కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. దీంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో...