శేరిలింగంపల్లి మండలం నవపక్షం రిపోర్టర్‌గా చిప్పోలు సాయి మురళి

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నవపక్షం దినపత్రిక శేరిలింగంపల్లి మండలం రిపోర్టర్‌గా చిప్పోలు సాయి మురళిని నియమించినట్లు పత్రిక యాజమాన్యం తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సామాజిక అంశాలు, స్థానికంగా చోటుచేసుకునే ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన వార్తలను సేకరించి నవపక్షం దినపత్రిక ద్వారా ప్రజలకు అందించేందుకు ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, సంబంధిత అధికారుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషించాలని యాజమాన్యం ఆకాంక్షించింది....