అమ్డాపూర్ గ్రామం 9వ వార్డులో వీధి దీపాల సమస్యకు పరిష్కారం

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  అమ్డాపూర్ గ్రామంలోని 9వ వార్డులో విద్యుత్ స్తంభాలకు కరెంట్ వైర్ లేకపోవడంతో వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన వార్డు సభ్యుడు గొల్లపల్లి రవీందర్ రెడ్డి వెంటనే స్పందించి, వీధి దీపాలు వెలిగేందుకు విద్యుత్ స్తంభాలకు కొత్త కరెంట్ వైర్ ఏర్పాటు చేయించారు. అనంతరం వార్డులోని ప్రజలను కలిసి ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి...