చౌటుప్పల్ హైవే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి – బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్

నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి : చౌటుప్పల్ పట్టణ పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులను అధికారులు వేగవంతం చేసి ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, వలిగొండ, మునుగోడు, నారాయణపూర్, ధర్మోజిగూడెం, గుజ్జ తదితర ప్రాంతాల నుంచి చౌటుప్పల్‌కు వచ్చే ప్రజలు కూడా ఇదే మార్గాన్ని...