హత్య కేసును ఛేదించిన చౌటుప్పల్ పోలీసులు

నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 24: చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని శనిగల గుట్ట వద్ద జరిగిన రావుల దానయ్య హత్య కేసును చౌటుప్పల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో మృతుడు రావుల దానయ్య భార్య శారద, అతని సొంత అన్న కుమారుడు శివ కలిసి హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయినట్లు డీఎస్పీ తెలిపారు. శారద, శివ మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు...