అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలి

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : నాంపల్లి మండల కేంద్రం నుంచి కొండమల్లేపల్లి వరకు కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ సామాజిక వేత్త కర్నాటి శ్రీహరి సోమవారం నాంపల్లి మండల ప్రజావాణిలో ఎంపీడీవో రామకృష్ణ శర్మకు వినతిపత్రం అందజేశారు. రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీహరి తెలిపారు. రహదారిపై కంకర పరిచి పనులు పూర్తికాకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇప్పటికే ఎంతోమంది...