పోలీసు వాహనం ప్రమాద ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి

విజయనగరం నగర పరిధిలో కేసు దర్యాప్తు నిమిత్తం వెళ్తున్న పోలీసు వాహనం ప్రమాదానికి గురికావడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత & సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ ఎస్. వెంకట రమణ మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ వెంకట రమణ కుటుంబానికి మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎస్పీ దామోదర్ తో వివరాలు తెలుసుకున్నానని మంత్రి...