జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కౌలూరి రాజేష్‌ను సత్కరించిన మంత్రి శ్రీనివాస్
నవపక్షం, విజయనగరం జిల్లా ప్రతినిధి : విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కౌలూరి రాజేష్‌ను రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్, మరియు ఎన్.ఆర్.ఐ సాధికారత & సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. నెల్లిమర్ల చిన్నమల్లుపేట ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, విద్యాబోధనలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న రాజేష్ సేవలు అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాట్సాప్ ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక విధానాలను విద్యారంగంలో వినియోగిస్తూ వేలాది...