బురదమయమైన రోడ్డుపై నాట్లు వేసి గ్రామస్తుల నిరసన గుంతలు, బురదతో అధ్వానంగా మారిన ప్రధాన రహదారి — అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
కొత్తపల్లి గోరి మండలం, వెంకటేశ్వర్లపల్లి: వెంకటేశ్వర్లపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలు, బురదతో అధ్వానంగా మారడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ రహదారిపై నీరు నిలిచి గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రోడ్డు దుస్థితిపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు వినూత్నంగా బురదమయమైన రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన చేపట్టారు. గుంతల్లో నీరు, బురద...