పంచాయతీ కార్యదర్శులపై పెరుగుతున్న పనిభారం తగ్గించాలి
నవపక్షం, నారాయణపేట జిల్లా ప్రతినిధి : పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం వరుసగా అదనపు బాధ్యతలు మోపుతూ తీవ్ర పనిభారానికి గురిచేస్తోందని తెలంగాణ రక్షణ సేన నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గవి నోళ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే రోజువారీ విధులతో పాటు జీపీడీపీ, జీ-సాప్ సర్వేలు, ఆన్‌లైన్ డేటా నమోదు, ఎస్‌ఐఆర్ బాధ్యతలు అప్పగించడంతో పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందన్నారు. జీపీడీపీ, జీ-సాప్ సర్వేల కోసం సుమారు 20 పేజీల బుక్‌లెట్లలో...