నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ తీరుపై ఆరోపణలు – సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు కోరిన నర్సింగ్ అధికారులు

నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో నర్సింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ వ్యవహారశైలిపై నర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులతో అనుచితంగా, అన్‌పార్లమెంటరీ భాషలో మాట్లాడుతున్నారని, దీంతో తాము మానసిక ఒత్తిడికి గురవుతున్నామని పలువురు నర్సింగ్ అధికారులు ఆరోపించారు. తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని, నాలుగేళ్లుగా పరిస్థితులను భరిస్తూ వస్తున్నామని నర్సింగ్ సిబ్బంది...