కార్మికుల సమస్యల కోసం AITUC సమరశీల పోరాటాలు :M L C నెల్లికంటి సత్యం
కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజిలేని సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు.శుక్రవారం భువనగిరి సుమంగళి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఏఐటీయూసీ యాదాద్రి భువన గిరి జిల్లా 3 వ మహాసభ లో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశంలో ఏర్పడిన మొట్టమొదటి సంఘం ఏఐటియుసి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని తిప్పికొట్టేందుకు కార్మిక లోకం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. పెట్రోల్...