ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడులు.. ఏజెన్సీలో అక్షర వెలుగులు

దమ్మపేట నవపక్షం :- ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ బడులకు దీటుగా అత్యుత్తమ ప్రమాణాలతో వర్ధిల్లాలన్నది ప్రభుత్వ ప్రధాన సంకల్పమని, ఆ సంకల్పాన్ని అశ్వారావుపేట ఏజెన్సీ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో అక్షరాలా నెరవేరుస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. ఒకప్పటి ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా (పీఈటీ) పనిచేసిన ఆయన, బడి పిల్లల కష్టనష్టాలను దగ్గరగా చూసిన వ్యక్తి కావడంతో.. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో తన సొంత చొరవతో 'మన బడి - మన ఎమ్మెల్యే' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో...