భువనగిరి లో మణిదీప మహా పూజ కార్యక్రమం
రాజరాజేశ్వరి అమ్మవారి మణిద్వీప క్షేత్రం విశ్వవ్యాప్తం కావాలనే సంకల్పంతో భాగ్యనగరంలో శైవ క్షేత్ర పీఠం ఆధ్వర్యంలో మహా క్షేత్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు, భారత ధర్మ దేవత బిరుదాంకితులు శివ స్వామీజీ వెల్లడించారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సోమ రాధాకృష్ణమూర్తి ఫంక్షన్ హాల్‌లో ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షతి రక్షితః ట్రస్ట్ ఆధ్వర్యంలో 33 జిల్లాల నుంచి విచ్చేసిన 600 మంది మహిళలతో మహాశక్తి మణిద్వీప మహా పూజలు వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ పరిసరాల్లో 50 ఎకరాల స్థలంలో...