జానపద గానానికి మధుర స్వరం… అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర
నవపక్షం, హైదరాబాద్: తెలంగాణ జానపద గేయాలకు తనదైన స్వరంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మధు ప్రియ జన్మదినం సందర్భంగా అభిమానులు, సంగీత ప్రియులు, కళాభిమానులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిన్న వయసులోనే పాటను తన జీవితంలో భాగంగా చేసుకున్న మధు ప్రియ, తన ప్రత్యేకమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ఆమె పాటల్లో వినిపించే తెలంగాణ మట్టి పరిమళం, పల్లె జీవన సౌందర్యం, మహిళల భావోద్వేగాలు, సామాన్యుల జీవితంలోని అనుభూతులు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మధు...