నిరుపేద కుటుంబానికి రూ.లక్ష CMRF LOC అందజేత.. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్
నవపక్షం, జనగామ జిల్లా ప్రతినిధి : బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద మున్నూరు కాపు కుటుంబానికి చెందిన జూల లక్ష్మయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రూ.1,00,000 విలువైన CMRF LOC మంజూరైంది. జూల లక్ష్మయ్య వేరికోసిల్ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని డీసీసీ ఉపాధ్యక్షులు నూకల బాల్ రెడ్డి, డీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నల్ల మహేందర్ ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబ పరిస్థితిని...