లండన్‌లో ఉన్నా.. నకిరేకల్ సేవే లక్ష్యం

నవపక్షం, హైదరాబాద్ కరస్పాండెంట్ :  మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తన పుట్టిన గడ్డను, తన ప్రజలను మరచిపోకుండా ఉండటమే అసలైన గొప్పతనం. విదేశాల్లో స్థిరపడినా స్వగ్రామంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ, తన వంతుగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న వ్యక్తి గొట్టేముక్కుల సతీష్ రెడ్డి. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన సతీష్ రెడ్డి చిన్ననాటి నుంచే చదువుపై దృష్టి సారించి, విద్యను తన ఎదుగుదలకు ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. కష్టపడి చదువుకుని అంచెలంచెలుగా ఎదిగి లండన్‌లో స్థిరపడ్డారు....