మృతుని కుటుంబాన్ని పరామర్శించిన వెన్నంపల్లి పాపయ్య
నవపక్షం, మొగుళ్లపల్లి ప్రతినిధి : మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం నాయకులు వాకిటి రాజు తాత మోరే రాఘవ రెడ్డి ఇటీవల పరమపదించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య వారి నివాసానికి వెళ్లి, మోరే రాఘవ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, రాఘవ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో...