యాదాద్రి భువనగిరి పోలీసుల ఆధ్వర్యంలో మహిళా భద్రత & బాలల పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు.

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా భద్రత మరియు బాలల పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.మహిళలు, బాలికలు మరియు చిన్నారులకు సురక్షితమైన, భయరహిత వాతావరణాన్ని కల్పించడంతో పాటు, ప్రమాదాలను గుర్తించే సామర్థ్యం, అప్రమత్తత మరియు తమ హక్కులపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమాల్లో పోలీసు అధికారులు మహిళలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రజలతో నేరుగా మాట్లాడి మహిళలపై వేధింపులు, గృహ హింస,...