రక్షాబంధన్‌ – శ్రద్ధ, గౌరవం, రక్షణకు ప్రతీక: IRAA గ్లోబల్ స్కూల్ విద్యార్థులు

నవపక్షం, చౌటుప్పల్ | ఆగస్టు 28 రాఖీ పండుగను పురస్కరించుకుని IRAA గ్లోబల్ స్కూల్‌లో విద్యార్థులు వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. సమాజ రక్షణ, సేవలో నిరంతరం ముందుండే పోలీస్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, వైద్యులు, పాఠశాల డ్రైవర్లకు విద్యార్థులు రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి మాత్రమే పరిమితం కాదని, శ్రద్ధ, రక్షణ, బాధ్యత, గౌరవం, కృతజ్ఞతలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఆపద సమయంలో అండగా నిలిచినట్లే,...