పేదింటి వివాహానికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రభుత్వ బీఎడ్ విద్యార్థి కార్తీక్ నాయక్ సేవాభావం

నవపక్షం, మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి :    పేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ప్రభుత్వ బీఎడ్ విద్యార్థి, గిరిజన శక్తి తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ నాయక్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొండయ్య తన కుమార్తె వివాహాన్ని సెప్టెంబర్ 3న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వివాహం నిర్వహించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కొండయ్య మిత్రుడు సచిన్ కార్తీక్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న కార్తీక్ నాయక్...