మక్తల్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నవపక్షం, నారాయణపేట జిల్లా ప్రతినిధి : మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి, నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ముందుగా మక్తల్ మండలం గొల్లపల్లి సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ...