రాఖీ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి రాఖీ కట్టిన సోదరి
నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 28: రాఖీ పండుగను పురస్కరించుకుని మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఆయన సోదరి ఆప్యాయంగా కలిసి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కట్టి, పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనురాగాలకు రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తుందని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి రాఖీ కట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కుటుంబ బంధాలు, ఆత్మీయతలు,...