జుక్కల్ మండల సరిహద్దు ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం — ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి
నవపక్షం, జుక్కల్ ప్రతినిధి, ఆగస్టు 29 : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణులు, ముఖ్యంగా చిరుతపులుల సంచారం ఉన్నట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దోస్పల్లి, సోపూర్, డోంగావ్, బంగార్‌పల్లి గ్రామాల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాలు, గ్రామ శివారు రహదారుల్లో చిరుతల సంచారం ఉన్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రానికి రాకపోకలు సాగించే వాహనదారులు, ఈ మార్గాల గుండా ప్రయాణించే ప్రజలు రాత్రి...