దేశభాషలందు తెలుగు లెస్స.. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్

నవపక్షం, వేములవాడ ప్రతినిధి : ఆగస్టు 29: తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడు గిడుగు రామమూర్తి పంతులు, భారతదేశ గొప్ప హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. “దేశభాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాష ఎంతో మధురమైనదని అన్నారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ప్రసిద్ధి చెందిన తెలుగు భాషకు...