ఈ రోజు భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద నిర్మించిన 444 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో సిద్ధం చేసిన 120 ఇళ్లను భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని నూతన గృహాల్లోకి ఎమ్మెల్యే గారు గృహప్రవేశం చేసారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజలను సంవత్సరాల తరబడి ఎదురుచూపులకు పరిమితం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టినా వాటిని పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలో అమలు చేయకుండా కేవలం ప్రచారానికే పరిమితం చేసిందని విమర్శించారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.
🔹 ఇప్పటికే 3,500 ఇళ్లను మంజూరు చేశాం..
1600 ఇళ్లని పూర్తి చేసాం..
కొత్తగా మరో 2,000 ఇళ్లను కేటాయిస్తున్నాం.
🔹 ప్రజల సమస్యలు మాకు తెలుసు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటాం.
🔹 సాగునీరు, తాగునీటి కాలువల పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం.
🔹 రూ.1,500 కోట్లతో భువనగిరి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
🔹 పార్టీ ఏదైనా పర్వాలేదు.. ప్రజలందరూ మాకు సమానమే. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం.
గత ప్రభుత్వ హయాంలో కాగితాలకే పరిమితమైన అభివృద్ధికి భిన్నంగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కళ్లముందే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గారు అన్నారు.“ఆఖరి మెట్టు ఎక్కితేనే విజయం. ప్రారంభించిన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. పేదల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు” అని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు,
హౌసింగ్ పిడి ఎల్.అలివేలు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ , స్థానిక తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ బొంతల నర్సింగరావు, ,మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకటేష్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు..


