నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులకు తోట లహరి శుభాకాంక్షలు

నవపక్షం, వేములవాడ ప్రతినిధి :  వేములవాడ పట్టణం, అర్బన్, రూరల్ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు వేములవాడ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట లహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతనంగా నియమితులైన నాయకులు సమష్టిగా కృషి చేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా కృషి చేయడంతో పాటు, ప్రభుత్వ విప్, వేములవాడ...