లక్కారంలో బోనాల పండుగ సందర్భంగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు
నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 31: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా గ్రామ బొడ్రాయి, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా మత్స్య సహకార శాఖ అధ్యక్షులు పాశం సంజయ్...