రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: BC, SC, ST-JAC & DSP
నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆగస్టు 31: BC, SC, ST-JAC మరియు DSP సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ ఎర్రోళ్ల శాంతికుమార్ నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా BC, SC, ST-JAC రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాసాల వినోద్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బకాయిలు విడుదల...