తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు

నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 31: తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. గతంలో ప్రకటించిన ప్రకారం ఆగస్టు 31తో దరఖాస్తుల గడువు ముగియాల్సి ఉండగా, మరో అవకాశం కల్పించాలని పలువురు ప్రజలు ప్రభుత్వాన్ని కోరడంతో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల కోసం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గడువు పొడిగించడంతో అర్హులైన వారు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని అధికారులు సూచించారు.