అభివృద్ధి పేరుతో భూసేకరణ…తొమ్మిదేళ్లగా పరిహారం ఇవ్వని ప్రభుత్వాలు..!
నవపక్షం, వేములవాడ ప్రతినిధి: వేములవాడ పట్టణంలో అభివృద్ధి పేరుతో చెరువు కట్టక్రింది ప్రాంతంలో గెజిట్ నంబర్ G/29/2017 పరిధిలోని సుమారు 20 ఎకరాల 20 గుంటల భూమిని 2017లో భూసేకరణ కింద తీసుకున్నప్పటికీ,ఇప్పటివరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అదే సమయంలో భూమి యజమానులకు నష్టపరిహారం కూడా చెల్లించలేదని బీజేపీ ఓబీసీ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు ఆరోపించారు.ఈ సమస్యపై సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,వైటీడీఏ వైస్ చైర్మన్ లకు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా...