కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలను గాలికొదిలేసింది ప్రజా సమస్యలపై సెప్టెంబర్‌ 2 నుంచి బీఆర్‌ఎస్‌ పోరుబాట ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌

ఆలేరు, సెప్టెంబర్‌ 1 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బిక్షమయ్య గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వెయ్యి రోజులు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు...