భూ రీసర్వే పనులను పరిశీలించిన యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

భూ రీసర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పోచంపల్లి మండలం అబ్దుల్లాపూర్ నగర్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా రీసర్వే పనుల పురోగతి, సర్వే నిర్వహణ విధానం, భూ సరిహద్దుల నిర్ధారణ తదితర అంశాలను పరిశీలించారు. రీసర్వే పనులను నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో...