నటి కళ్యాణికి విత్తన గణపతి అందజేత
నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 1: మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన విత్తన గణపతిని ప్రముఖ నటి కళ్యాణికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ అందజేశారు. ఈ సందర్భంగా గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా విత్తన గణపతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. వినాయక చవితి అనంతరం విత్తన గణపతిని మట్టిలో నాటడం ద్వారా అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయని పేర్కొన్నారు....