కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి
నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 1 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ‘కాంగ్రెస్ 1000 రోజుల దగా – సమరభేరి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2026 సెప్టెంబర్ 2న ఉదయం 10:00...