కొనరావుపేట ఎస్సై రామ్మోహన్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

నవపక్షం, రాజన్న సిరిసిల్ల జిల్లా, కొనరావుపేట: కొనరావుపేట మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రామ్మోహన్ గౌడ్‌ను మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై రామ్మోహన్ గౌడ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నిజామాబాద్ సర్పంచ్ సింగం శ్రీహరి, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, గ్రామ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, మండల ఎగ్జిక్యూటివ్ సభ్యులు తాళ్లపల్లి కళ్యాణ్, మెరుగు లక్ష్మణ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.