ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు నకిరేకల్‌లో భారీ బహిరంగ సభ.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవపక్షం, నకిరేకల్, ప్రతినిధి: ఈ నెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటన నేపథ్యంలో మినీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని, గత విధ్వంస పాలన...