పర్యావరణ పరిరక్షణకు విత్తన గణపతి పంపిణీ

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 1: పర్యావరణ పరిరక్షణ, హరితహారం విస్తరణ లక్ష్యంగా మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమంలో భాగంగా రూపొందించిన విత్తన గణపతిని మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ అందజేశారు. ఈ సందర్భంగా గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడమే విత్తన గణపతి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు....