భారత్‌లో తొలిసారిగా ‘అగ్రి డాక్టర్ ఉద్యమానికి’ నాంది
నవపక్షం, వ్యవసాయ విభాగం ప్రతినిధి : వ్యవసాయ ఆధునిక వృత్తి అవకాశాలను పరిచయం చేయడంతో పాటు, రైతులకు క్షేత్రస్థాయిలో నాణ్యమైన సాంకేతిక మార్గదర్శనం అందించే నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో నవ నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ది ఫార్మిస్ట్ సమ్మిట్–2026’ను ఆదివారం కుత్బుల్లాపూర్ బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోనే తొలిసారిగా ‘అగ్రి డాక్టర్ ఉద్యమం’కు ఈ సదస్సు ద్వారా నాంది పలికినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది, వెన్నెల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుంకర నరేష్ హాజరై...