భువనగిరి క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ దాడి హేయమైన చర్య – ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

  భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై నిన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటనను భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఈరోజు క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేయడం హేయమైన చర్య.. ఇది రాజకీయం కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి” అని అన్నారు.ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలని, ప్రత్యర్థులపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి తప్ప దాడులు, హింసకు పాల్పడటం ప్రజాస్వామ్య సంస్కృతి కాదని అన్నారు....