కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

నవపక్షం, బోడుప్పల్ ప్రతినిధి :  కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో 420 హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో, బోడుప్పల్ మాజీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్...